పఠాన్ డైరక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఇప్పుడు క్లౌడ్ నైన్‌లో ఉన్నారు. ఇండియాలో ఇప్పటిదాకా వెయ్యి కోట్ల మార్కును దాటిన సినిమాలు ఐదంటే ఐదే. ఇప్పుడు వాటిలో ఒకటి పఠాన్. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఆనందంగా పరుగులు తీస్తున్నారు సిద్ధార్థ్. ఇండియా ఫస్ట్ ఏరియల్ యాక్షన్ సినిమా అంటూ ఫైటర్ సినిమా ప్రమోషన్లు జరుగుతున్నాయి. బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాల తర్వాత హృతిక్ రోషన్‌తో సిద్ధార్థ్ ఆనంద్ రీయూనియన్ అవుతున్న సినిమా ఇది. దీపిక పదుకోన్ నాయికగా నటిస్తున్నారు. హృతిక్, దీపిక ఇద్దరూ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇది. హ్యూజ్ స్కేల్ ప్రాజెక్ట్ గా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకుంది.
ఈ సందర్భంగా హృతిక్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు సిద్ధార్థ్. ``నా మనసులో ఏం ఉన్నా హృతిక్ చదివేయగలడు. ఆయనతో నాకు పదేళ్ల అనుబంధం ఉంది. మేం ఇద్దరం కలిస్తే సినర్జీ ఇంకో రకంగా ఉంటుంది. హీరోకీ, డైరక్టర్‌కీ ఉండాల్సిన బాండింగ్ మా మధ్య ఎప్పుడూ ఉంటుంది. ఈ సారి ఆడియన్స్ కి కొత్త ట్రీట్ ప్లాన్ చేస్తున్నాం. ఇటీవలే మూడో షెడ్యూల్ పూర్తి చేశాం. ఫస్ట్ షెడ్యూల్ అస్సాంలో చేశాం. రెండో షెడ్యూల్‌ని కాశ్మీర్‌లో చేశాం. మూడో షెడ్యూల్ హైదరాబాద్‌లో షూట్ చేశాం. ఇంకా సినిమా షూటింగ్ చాలా చేయాలి. సరికొత్తగా చాలా క్రియేట్ చేయాలి`` అని అన్నారు. పఠాన్ తర్వాత దీపికతో సిద్ధార్థ్ పనిచేస్తున్న మూవీ ఫైటర్.
ఈ సినిమాలో ఆమె కేరక్టర్ ఆద్యంతం కొత్తగా ఉంటుందని చెప్పారు. దీపిక పాత్ర గురించి మాట్లాడుతూ ``పఠాన్‌లో ఆమె స్పై కేరక్టర్ చేశారు. ఫైటర్‌లో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఆథంటిక్, రూటెడ్ పాత్రలో కనిపిస్తారు. ఈ కేరక్టర్ కోసం ఆమె కూడా చాలా రీసెర్చ్ చేశారు. ఆమె కేరక్టర్‌కి జనాలు విపరీతంగా కనెక్ట్ అవుతారు. పఠాన్‌లో ఆమెది జస్ట్ కమర్షియల్ రోల్. కానీ ఫైటర్‌లో ఆథంటిక్ పాత్ర ప్లే చేశారు. ఆమె ఇందులో యాక్షన్‌కి ప్రాముఖ్యత ఉన్న రోల్ చేశారు`` అని అన్నారు.